Saturday, December 21, 2024

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఫౌజీ, స్పిరిట్ ను క్రేజీ అప్డేట్స్

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 45వ బర్త్‌డేను ఈ నెల 23వ తేదీన గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ప్రభాస్ పుట్టినరోజున ఆయన నటిస్తున్న సినిమాల నుండి బర్త్ డే ట్రీట్స్ రానున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా నుండి ఒక స్పెషల్ ఆడియో గ్లింప్స్‌ను ఈనెల 23వ తేదీన విడుదల చేయనున్నారని తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ కెరీర్‌లో మొదటిసారి ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ డ్రామా ‘ఫౌజీ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఈనెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ప్రభాస్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ ఇండియన్ బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ పాన్ ఇండియా స్టార్ చేస్తున్న మరో సినిమా రాజాసాబ్ నుండి ఫస్ట్ సింగిల్ లేదా టీజర్ ఈనెల 23 న విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News