Friday, January 3, 2025

స్పిరిట్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన వంగా సందీప్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో ఇండియాలో నంబర్ వన్‌గా రిక్డారు సృష్టించింది. అన్ స్టాపబుల్ టాక్‌షోకు నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికే రెండు షోలు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అన్ స్టాపబుల్ టాక్ షో మూడో సీజన్‌లో అడుగుపెట్టింది. మూడో సీజన్‌లో మొదటి ఎపిసోడ్‌కు భగవంత్ కేసరి సినిమా యూనిట్ హాజరైంది. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్స్ శ్రీలీల, కాజల్‌తో బాలయ్య సరదాగా మాట్లాడారు. తనదైన శైలిలో వారిని బాలయ్య ఆటపట్టించడంతో నవ్వులతో ముంచెత్తారు.

బాలయ్య అన్ స్టాపబుల్‌షో రెండో ఎపిసోడ్‌కు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హాజరయ్యాడు. యానిమల్ సినిమా ప్రమోషన్‌స్‌లో భాగంగా రణబీర్ కపూర్, రష్మిక, దర్శకుడు సందీప్ రెడ్డి హాజరయ్యారు. ప్రభాస్‌తో స్పిరిట్ అనే సినిమా షూటింగ్ చేస్తానని సందీప్ రెడ్డి వంగా ఆప్డేట్ ఇచ్చాడు. స్పిరిట్ అనే మూవీ పాన్ ఇండియాలో లేవల్లో తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2024 సెప్టెంబర్ నుంచి స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. బాహుబలి2 తరువాత ప్రభాస్ సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు సలార్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. స్పిరిట్ సినిమా కూడా హిట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News