Saturday, December 21, 2024

ఆధ్యాత్మిక కేంద్రాలు స్టార్టప్‌లకు స్ఫూర్తినివ్వాలి

- Advertisement -
- Advertisement -

Spiritual centers should inspire startups: PM Modi

ప్రధాని నరేంద్రమోడీ పిలుపు

న్యూఢిల్లీ : దేశం లోని స్టార్టప్‌లు, మేక్ ఇన్ ఇంచియా కార్యక్రమాలకు ఇక్కడి ఆధ్యాత్మిక నిలయాలు స్ఫూర్తిదాయక కేంద్రాలుగా నిలవాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 80 వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఆదివారం ప్రధాని ఆన్‌లైన్ వేదికగా తన సందేశం అందజేశారు. అందరికోసం పాలుపడాలంటై మన సాధువులు ఎల్లప్పుడూ ప్రజల్లో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. గణపతి సచ్చిదానందస్వామి జీవితం సైతం సమాజ సేవ, దానధర్మాలతో నిండి ఉందని, అనేక ఆశ్రమాలు, పెద్ద సంస్థ, వివిధ ప్రాజెక్టుల రూపంలో ఇది కనిపిస్తుందని కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచం మన స్టార్టప్‌లను భవిష్యత్తుగా చూస్తోంది.

మేక్ ఇన్ ఇండియా , ప్రపంచ అభివృద్ధికి ఆశాకిరణంగా మారుతోంది. ఈ క్రమం లోనే మన ఆధ్యాత్మిక కేంద్రాలు , స్టార్టప్‌లకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నారని ప్రధాని అన్నారు. దేశాభివృద్ధి కోసం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ , సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అనే మంత్రంతో సమష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు. దేశ అమృతోత్సవాల సందర్భంలో స్వామి 80 వ జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నాం. స్వార్ధానికి తావు లేకుండా ప్రజాసేవకు అంకితం కావాలని మన ఆధ్యాత్మిక వేత్తలు మనలో ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తారు అని అన్నారు. మరో నెల రోజుల్లో రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ … యోగా, యువత… ఈ రెండు నేడు భారత్‌కు గుర్తింపుగా మారాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News