అచ్చంపేట రూరల్ : మండల పరిధిలోని శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరు గాంచిన ఉమామహేశ్వర దేవ స్థానంలో బుధవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన దశాబ్ది ఉత్సవాల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ధూప దీప నైవేద్య పథకం రాష్ట్రంలో అద్భుతంగా అమలవుతుందని దీని ద్వారా ప్రజల్లో దైవభ క్తి పెరుగుతుందన్నారు. అత్యధిక ంగా 33 దేవాలయాలకు దూపదీప నైవేద్య పథకం నల్లమలలో అమ లవుతుందని తెలిపారు. ఉమా మహేశ్వర దేవాలయం అన్ని విధాలా అభివృద్ధి చేసినందుకు చైర్మన్ క ందూరు సుధాకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమామహేశ్వరం పేరును విని పించే విధంగా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మద్దిమడుగు ఆలయ చైర్మెన్ విష్ణు మూర్తి, మున్సిపల్ చైర్మెన్ నరసి ంహ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు పి. మనోహర్, గ్రామ సర్పంచ్ లోక్య నాయక్, మాజీ ఎంపిపి పర్వతాలు, నాయకులు రాజేశ్వర్ రెడ్డి, రమాకాంత్ శంకర్, మద్దిమడుగు దేవస్థానం అధికారి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.