Friday, December 20, 2024

ఆలయాలకు ఆధ్యాత్మిక వైభవం

- Advertisement -
- Advertisement -
  • తుక్కుగూడ వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు: తెలంగాణ ప్రభుత్వం పురాతన ఆలయాలకు ఆధ్యాత్మిక వైభవాన్ని అందించే దిశగా చర్యలు తీసుకుంటోందని విద్యాశాఖా మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహేశ్వరం మండల పరిధిలోని రెండు పురాతన ఆలయాల అభివృద్ధికి సుమారు రూ.8 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు.

ఈ మేరకు ఆదివారం తుక్కుగూడ మున్సిపాల్టీ పరిధిలోని ఫ్యాబ్‌సిటి శ్రీనగర్‌కాలనీలో గల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ప్రతి గుడిలోనూ ధూప, ధీప నేవేద్యాలు నిత్యం జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. సిఎం కెసిఆర్ దూరదృష్టితో బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో బ్రాహ్మణ పరిషత్ భవన నిర్మాణ పనులకు ఇటీవలే శంకుస్థాపన చేసినట్లు ఆమె తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని శివగంగ, సంతాన వేణుగోపాలస్వామి, ఖిలా మైసమ్మ, శ్రీలక్ష్మినరసింహ్మస్వామి, శ్రీవెంకటేశ్వరస్వామి, శ్రీవీరాంజనేయస్వామి, శ్రీసేవాలాల్ మహారాజ్ ఆలయాలకు ఒక్కో కోటి మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. సిఎం కెసిఆర్ సత్సంకల్పంతో నిర్మించిన యాదాద్రి ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోందని ఆమె అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ భక్తులకు సకల సౌకర్యాలు కల్పించనున్నట్లు ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News