రామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం క్షేమం కోసమే ఆధ్మాత్మిక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు,తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలనే కాంక్షతో ఆధ్మాత్మిక పూజలు నిర్వహిస్తు ప్రతి ఆలయాలలో ప్రత్యేక అర్చనలు,అభిషేకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నా రు.బుధవారం మండల కేంద్రంలోని ఇసన్నపల్లి రామారెడ్డి గ్రామాల మధ్యలో వెలసిన ప్రసిధ్ద పుణ్యక్షేత్రం శ్రీకాలబైరవ స్వామి వారిని ఎమ్మెల్యే దర్శించుకొని ఆలయంలో ఆధ్మా త్మిక పూజలలో పాల్గొని ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, పూజలు చే శారు.
ఆధ్మాత్మిక దినోత్సవ పూజల్లో భాగంగా ఆలయంలో పూలతో ప్రత్యేక ఆలంకరణ చేసి అభిషేకములు,ప్రసాదం వితరణ,సిందూర పూజలు, హోమం,భజన కార్యక్రమాలతో దీపారాధన నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ నారెడ్డి దశర త్‌రెడ్డి,ఆలయ కమిటీ చైర్మెన్ బెజుగం మాలతి సంతోష్ గుప్తా,ఆలయ ఈవో ప్రభు రాంచంద్రం,సర్పంచ్‌లు బాలమణి లింబాద్రి,సంజీవ్,వైస్ ఎంపీపీ రవీందర్ రావు, రైతుబంధు మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి,బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్‌గౌడ్,ఆలయ కమిటీ సభ్యులు,ఆలయ జూనియర్ అసిస్టెంట్ సురేందర్,ఆయా గ్రామాల సర్పంచ్‌లు,ఎంపీటీసీలు,ఉప సర్పంచ్‌లు,నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.