Thursday, January 9, 2025

మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మికం దోహదం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ : మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మికం ఎంతగానో దోహదపడుతుందని వికారాబాద్ శాసన సభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది దినోత్సవాలలో భాగంగా బుధవారం అనంతపద్మనాభ స్వామి దేవాలయం, మెథడిస్ట్ చర్చ్, ఎన్నేపల్లి మజీద్ నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు రామిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ లతో కలిసి శాసనసభ్యులు సర్వమత ప్రార్ధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కులాలు మతాలకు అతీతంగా అందర్నీ సమానంగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే దేవాలయాలు, చర్చిలు మసీదుల నిర్మాణాలతో పాటు శిథిలావస్థలో ఉన్న వాటిని మరమ్మతులు చేసి అభివృద్ధి పరచడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్ వచ్చిన తర్వాత తిరుపతి తరహాలో యాదగిరిగుట్ట అతి సుందరంగా నిర్మించి అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్ అభినందనీయులని ఆయన కొనియాడారు. అన్ని మతాలు సమానత్వాన్ని ప్రబోధిస్తాయని, ప్రజలంతా ప్రేమ భావాలతో కలిసిమెలిసి ఉంటూ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా అన్ని సౌకర్యాలతో కూడిన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ప్రభు త్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్న వారికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మత విశ్వాసాలను కాపాడుతూ, గౌరవిస్తూనే అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఆధ్యాత్మిక కేంద్రాలను కాపాడుకునే దిశగా ధూప దీప నైవేద్యానికి నెలకు 10 వేల రూపాయలను ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

హిందూ ముస్లీం, క్రిస్టియన్ అనే తారతమ్యం లేకుండా ప్రభుత్వమే పండుగలను నిర్వహిస్తూ, పేద ప్రజలకు వస్త్రాలను అందచేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. మైనార్టీలు విద్యాపరంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రత్యేక గురుకులాలను స్థాపించి అన్ని సౌకర్యాలను కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా ఉపాధి కల్పన కోసం సబ్సిడీ రూపేనా రుణాలను అందజేస్తూ ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్య , ఉద్యోగ రంగాల్లో ప్రోత్సహిస్తూనే ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఫలాలను ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చెం దాలని కలెక్టర్ సూచించారు.

ప్రభుత్వం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూనే విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని ఆయన తెలిపారు. ఆధ్యాత్మిక దినోత్సవ కార్యక్రమాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సుధారాణి, ఆర్డీవో విజ యకుమారి, కౌన్సిలర్లు పుష్పలత రెడ్డి, అనంతరెడ్డి, గోపాల్, దేవాదాయ శాఖ ఈవో నరేందర్, మెథడిస్ట్ చర్చ్ జిల్లా సూపరింటెండెంట్ జాన్ విక్టర్, పాస్టర్లు శైలేష్, పవన్‌లతోపాటు వివిధ మతాల మత పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News