Monday, December 23, 2024

యాదాద్రిలో బ్రహ్మోత్సవ అలంకార సేవల వైభవం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి : జగత్ రక్షణకు భగవానుడు దాల్చిన ఆవతార రూపములలో యాదాద్రి బ్రహ్మోత్సవాలలో శ్రీలక్ష్మీనరసింహుడు లోక కల్యాణార్ధం దర్శనమిస్తున్న అలంకార సేవల వైభవం కనుల పండుగా సాగుతున్నాయి. యాదాద్రి ఆలయ పునఃనిర్మాణం తరవుతా తొలిసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాలు పదకొండు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారము శ్రీలక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం గోవర్ధన గిరిధారి, రాత్రి సింహవాహన అలంకార రూపిడిగా భక్తకోటికి యాదగిరిశీడు దర్శినమించారు.

ఉదయం ఆలయంలో నిత్యారాధానలు అనంతరము ఉత్సవ వేడుకలో భాగంగా గోవర్ధనగిరిధారిగా శ్రీలక్ష్మీనరసింహుని అలంకరించి అర్చకులు, పండితులు, పారాయణికులు ఆగమ శాస్త్రరిత్య వేద మంత్రాలను ఉచ్చరిస్తు మేళతాళముల మద్య శ్రీవారి సేవను ఊరేగించగా భక్తులు, స్థానికులు దర్శించుకున్నారు. ఆలయంలో అలంకార సేవను కోలువు దీర్చన అర్చకులు సేవ విశిష్టతను తెలియ చేస్తు శ్రీకృష్టిడు తన బాల్య లీలలో భాగము ఇంద్రుడి అహంకారం తొలగించుటకు శ్రీకృష్ణుడు వర్షాలకోసం గోవులకు, గోవర్ధన గిరి పర్వతానికి పూజలు చేయాలని తెలిపిన సమయంలో ఇంద్రుడు రాళ్ల వర్షం కురిపించగా ఆవులను, ప్రజలను. భక్తులను రక్షణ నిమిత్తం గోవర్ధనగిరి పర్వతాని ఎత్తి భగవానుడి తత్తం చాటిన విదానమే గోవర్ధనగిరిదారి అలకంకార సేవలో భక్తుకోటిని రక్షించుటకు శ్రీలక్ష్మీనరసింహుడి అలంకార సేవ విశీష్టతగ తెలిపారు.

సింహ వాహన సేవ..

శ్రీ వారిఆలయంలో సాయంత్రం శ్రీస్వామి వారిని సింహ వాహన సేవలో అలంకరించి మేళతాళముల నడుమ వేదమంత్రాలు ఉచ్ఛరణ చేస్తూ ఆలయ మాడవీదులలో ఊరేగించి మండపములో స్వామివారి సేవను కొలువుదీర్చగా భక్తులు దర్శించుకొని తరించారు. బ్రహ్మోత్సవ విశేషంలో సింహవాహన సేవగా పేర్కొని సింహం మహాతేజశ్శాలీ మదపుటేనుగులంటి దుష్టుల పాలిట సింహం లాంటి వాడు శ్రీ లక్ష్మీనరసింహుడు అని జీవుల్లో నరుడు ఉత్తముడు పరాక్రమ జంతువుల్లో సింహం ఉత్తమం కనక నరుడూ, సింహం ఈ రెండు రూపాలను ధరించిన శ్రీలక్ష్మీనరసింహుడు దుష్టశిక్షణ శిష్టరక్షణ గావించుతున్నా రూపమే సింహా వాహన సేవ విశిష్టతను అర్చకులు భక్తులకు తెలియ చేశారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త నరసింహ్మమూర్తి, వైటిడిఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు,ఆలయ ఈవో గీత, యజ్ఞాచార్యులు, ప్రధాన అర్చకులు నల్లంధిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాడూరి వెంకటాచార్యులు, వేద పండితులు, అర్చకుల బృందం, ఆలయ ఉద్యోగ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

నేడు శ్రీస్వామివారి ఎదుర్కోలు మహోత్సవం..

శ్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలోని ముఖ్య ఘట్టాలలో భాగంగా సోమవారం రాత్రి శ్రీస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది. ఉదయం ఆలయంలో జగన్మోహిని అలంకార సేవ సాయంత్రం అశ్వ వాహన సేవలో స్వామి, అమ్మవార్లను ఊరేగించి తిరుకళ్యాణ మహోత్సవానికి దివ్యమైన ముహుర్తాన్ని నిర్ణయించుటకు శ్రీస్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి శాస్త్రోక్తంగా ఎదుర్కోలు మహోత్సవం జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News