Monday, March 3, 2025

డ్రై లిక్విడ్ గంజాయి వంటి పదార్థాలపై నిఘా పెట్టాం: మంత్రి అనిత

- Advertisement -
- Advertisement -

అమరావతి: గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా గంజాయి సాగు, రవాణా జరిగింది అని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రశ్నోత్తరాలపై అసెంబ్లీలో మంత్రి అనిత మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలనకు ‘ఈగల్’ వ్యవస్థ ఏర్పాటు చేశామని, 26 జిల్లాలో 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేశామని అన్నారు. డ్రై లిక్విడ్ గంజాయి వంటి పదార్థాలపై నిఘా పెట్టామని, లోకేష్ ఆధ్వర్యంలో స్కూళ్లలోనూ ‘ఈగల్’ కమిటీల ఏర్పాటు చేయాలని తెలియజేశారు. గంజాయి, డ్రగ్స్ పై టోల్ ఫ్రీ నంబర్ 1972 ద్వారా సమాచారం ఇవ్వాలని అనిత సూచించారు. డ్రోన్, ఎడ్రిన్ శాటిలైట్ టెక్నాలజీ గంజాయి సాగు అరికడుతున్నామని, గంజాయి కొరియర్లపై కఠిన చట్టాలు అమలు చేస్తామని వెల్లడించారు. మహిళలకు గంజాయి అలవాటు చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపడతామని మంత్రి అనిత స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News