Sunday, December 22, 2024

ఇజ్రాయెల్ సరికొత్త ఆయుధం ‘స్పాంజ్ బాంబు’

- Advertisement -
- Advertisement -

జెరూసలేం : గాజాలో హమాస్ తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయిల్ కొత్త ఆయుధాన్ని తయారు చేసింది. అంతుచిక్కని ఆ టన్నెల్స్‌లో ముందుకు వెళ్లేందుకు ఇజ్రాయిల్ దళాలు స్పాంజ్ బాంబును అభివృద్ది చేశాయి. ఆ రసాయనిక బాంబుతో టన్నెల్స్‌లో హమాస్ ఉగ్రవాదుల ఏరివేతకు ఐడిఎఫ్ సిద్ధమైంది. టన్నెల్స్ హమాస్ ఉగ్రవాదులకు శక్తి కేంద్రాలు. అయితే స్పాంజ్ బాంబులతో ఆ టన్నెల్స్‌లో ఆపరేషన్ కొనసాగించనున్నది. ఆ బాంబు పేలడంతో ఫోమ్ వస్తోంది. ఆ ఫోమ్ టన్నెల్స్‌లో ఉన్న గ్యాప్‌లను మూసివేస్తాయి. దీంతో ఉగ్రవాదుల కదలికలను నియంత్రించవచ్చు అని ఇజ్రాయిల్ దళాలు భావిస్తున్నాయి. ఓ ప్లాస్టిక్ కంటెయినర్‌లో ఉన్న రెండు ద్రవాలు పేలిన తర్వాత స్పాంజ్ బాంబుగా మారుతాయి. టన్నెల్స్ వెళ్తున్న రూట్లోనే ఇండ్లు, మసీదు, చర్చిలు ఉన్నాయి.

గాజా మెట్రోగా ఆ టన్నెల్స్‌ను పిలుస్తుంటారు. అయితే గ్రౌండ్ ఆపరేషన్‌లో గాజా మెట్రో టన్నెల్స్ కీలకం కానున్నాయి. ఇటీవల దాడి తర్వాత హమాస్ ఉగ్రవాదులు సుమారు 200 బందీలను ఆ టన్నెల్స్‌కు తీసుకు వెళ్లినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అండర్‌గ్రౌండ్ టన్నెల్స్ సుమారు 311 మైళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంత దూరం ఉండే ఈ టన్నెల్స్‌లో ఎలా ఇజ్రాయిల్ దళాలు ముందకు కదులుతాయో అంచనా వేయడం అసాధ్యమే. సుమారు వంద ఫీట్ల లోతులో ఉండే ఆ టన్నెల్స్ చిమ్మచీకటితో నిండి ఉంటాయి. ఏ టన్నెల్ ఎటు వెళ్తుందో తెలియదు. ఎక్కడ ఎటువంటి ట్రాప్ ఉందో కూడా తెలుసుకోలేం. కాంక్రీట్‌తో ఉన్న ఆ టన్నెల్స్.. ఇజ్రాయిల్ దళాలకు గ్రౌండ్ ఆపరేషన్ అంత సులువేమీ కాదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News