Sunday, January 19, 2025

దేశానికి క్రీడలు వన్నె తెస్తాయి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో : క్రీడల ద్వారా దేశానికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడారంగంలో మన రాష్ట్రానికి చెందిన పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చారని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో ఉన్న మహబూబ్‌నగర్ గ్రా మర్ స్కూల్‌లో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భ ంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీల్లో విజేతలుగా నిలలిచిన విద్యార్థులకు మంత్రి బహుమతులను పంపిణీ చే శారు.

రాష్ట్రంలో ప్రతి గ్రామానికిక్రీడా మైదానం అందించిన ఘనత సీఎం కేసిఆర్‌కే దక్కుతుందని మంత్రి తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, జయరామ సంస్థల ఎండి రామిరెడ్డి, శ్రీనివాస్ , జిల్లా రైతుబంధు సమితి డైరెక్టర్ మల్లు న ర్సింహరెడ్డి, కౌన్సిలర్ రష్మిక, నాయకులు ప్రశాంత్ , ప్రభాకర్ , రాజేశ్వర్‌రెడ్డి, శివరాజ్ , మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేటలో …..
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జరిగిన ఛలో మైదాన్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జడ్పీ చైర్ పర్సన్ వనజ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులను, క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ నారాయణపేట జిల్లా నుం డి వివిధ క్రీడలలో కక్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్ జాతీయ స్థాయిలో ఆడాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఈటీలు ఆంజనేయు లు, రమణ, అనంతసేన, సాయినాథ్ , మౌలాలి, రాజశేఖర్ , వేణు, అక్తర్ , పారిజాత, రూప, పర్వీ న్ , రాధిక, భీంరెడ్డి, అజిత్ , రఘు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్ ప్రతినిధి…
క్రీడలలో యువత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యా న్ చంద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగ ళవారం మేజర్ ధ్యాన్ చంద్ 118 జయంతి రోజు ను పురస్కరించుకుని జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యం లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు స్థానిక బా లుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన జిల్లా కలెక్టర్ ధ్యాన్ చంద్ చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువతనుద్దే శించి కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు తో పాటు క్రీడల్లో పాల్గొనడం చాలా ముఖ్యమని తెలిపారు.

ఏ విద్యార్థి అయిన వంద శాతం మా ర్కులు సంపాదించినంత మాత్రాన జీవితంలో విజయం సాధిస్తారని అనుకోలేమని అన్నారు. అదే ఒక సబ్జెక్టుపై నిష్ణాతుడైన వారు అందులో విజ యం సాధిస్తాడని అనుకోవచ్చు కానీ యాటిట్యూడ్ ఉన్న వారు ఒకసారి ఓటమి చెందినా దానిని సవాలుగా తీసుకుని తిరిగి పోరాటం చేసే వాడే క్రీడాకారుడు అని, వారు జీవితంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పారు. క్రీడాదినోత్సవ ఏ ర్పాట్లు గత రెండు మూడు నెలల నుంచి ప్రార ంభమయ్యాయని, ఇప్పటికే గ్రామ స్థాయిలో క్రీడ లు నిర్వహించి జిల్లా, రాష్ట్ర స్థాయికి పంపించడం జరిగిందన్నారు.

కొంత మందికి కనీస వ్యాయా మం శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక అనారో గ్యాలకు గురవుతారనే దానిని అధిగమించడానికి ప్రతి ఒక్కరు కనీస వ్యాయాయం చేయాలని, తనకు ఇష్టమైన క్రీడల్లో పాల్గొనాలని పిలుపుని చ్చారు. అనంతరం క్రీడల్లో రాణించాలని క్రీడాకా రులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంత రం నాగర్‌కర్నూల్ ఆర్డిఓ వెంకట్ రెడ్డి క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడలతో పాటు ఓటు ప్రాధాన్యత, ఓటు నమోదు పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల వయ స్సు కలిగిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసు కునే విధంగా ప్రచారం చేయాలన్నారు.

ప్రతి ఒక్క రు కనీస వ్యాయామం చేయాలని, క్రీడల్లో పాల్గొ నాలని సూచించారు. ఎన్నికల స్వీప్ నోడల్ అ ధికారి రామ్మోహన్ రావు ఓటు నమోదు కార్యక్రమ ంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడాకారుల శాఖ అధికారి సీతా రాం, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమ ణ, ఆయా కళాశాలల ప్రిన్సిపల్, పిఈటిలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News