న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో క్రీడా రంగానికి తీవ్ర నిరాశ ఎదురైంది. తాజా బడ్జెట్‌లో భారీ కోత విధించారు. ఈ సారి బడ్జెట్‌లో క్రీడలకు ఏకంగా 230.78 కోట్ల రూపాలయను తగ్గించారు. దీని ప్రభావం దేశంలో క్రీడాభివృద్ధిపై పడడం ఖాయంగా కనిపిస్తోంది. గతంతో కంటే ఈసారి బడ్జెట్‌లో క్రీడలకు ప్రాధాన్యత పెరుగుతుందని భావిస్తే ఆర్థిక మంత్రి మాత్రం ఉన్న బడ్జెట్‌లోనే భారీ కోత విధించి షాక్ ఇచ్చారు. ఈసారి బడ్జెట్‌లో క్రీడలకు రూ.2596.14 కోట్లను కేటాయించారు. ఇక, కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా కార్యక్రమంలో దీనిపై ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది.
గతంతో పోల్చితే ఈసారి ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్ భారీగా తగ్గి పోయింది. గతంలో ఖేలో ఇండియా రూ.890.42 కోట్లు కేటాయించగా ఈసారి దాన్ని రూ.890.42 కోట్ల రూపాయలకు కుదించారు. ఇదిలావుండగా బడ్జెట్‌లో క్రీడలపై చిన్న చూపు చూడడంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. క్రీడా బడ్జెట్‌ను పెంచాల్సింది పోయి భారీగా కోత విధించడంపై భాత ఒలింపిక్ సంఘంతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ఒలింపిక్స్ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
Sports Budget takes cut of Rs 230 Crore