మనతెలంగాణ/మహబూబాబాద్ : క్రీడలతో శరీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో మహబూబాబాద్, తొర్రూరు పోలీసు డివిజన్ల మహిళా సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖోఖో, కబడ్డీ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు నిత్యం తమ విధినిర్వహణలో ఒత్తిడీలకు గురవుతుంటారని తెలిపారు. వారికి శారీరక, మానసిక ఉల్లాసం కలిగించేందుకే ఈ క్రీడా పోటీలను నిర్వహించినట్లు వివరించారు. పోలీసులు ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ శారీరక దృఢత్వాన్ని కాపాడుకునేందుకు నిత్యం ప్రాక్టీసు చేయాలని సూచించారు.
క్రీడలు వ్యక్తిలోని నాయకత్వ లక్షణాలను తట్టి లేపడంతో పాటు టీం స్పిరిట్ ఐకమత్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతాయని పేర్కోన్నారు. ఆటల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించి మరో ఆటలో గెలుపొందేందుకు అనుకూలంగా తగిన ప్రాక్టీస్ చేయాలని ఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలు ఆసక్తికరంగా జరిగాయి. పోటాపోటీగా తలపడ్డ ఈ క్రీడా పోటీల్లో భాగంగా ఖోఖోలో తొర్రూరు జట్టు, కబడ్డీలో మహబూబాబాద్ డివిజన్ జట్లు గెలుపొందగా వారికి ఎస్పీ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జోగుల చెన్నయ్య, మహబూబాబాద్ ఇన్‌చార్జి డిఎస్పీ రమణ బాబు, గేమ్ ఆర్గనైజర్ ఆర్.ఐ సురేష్, టౌన్ సీఐ సతీష్, రూరల్ సీఐ రమేష్, ఆర్.ఐ నరసయ్య, లాల్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.