Monday, December 23, 2024

మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం

- Advertisement -
- Advertisement -

అశ్వారావుపేట : మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అచ్యుతాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా మెచ్చా మాట్లాడుతూ శారీరక శ్రమకు క్రీడలు ఎంతో అవసరం అని నియోజకవర్గ యువత క్రీడల్లో కూడా మంచిగా రాణించి మన ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్న నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకొని పోటీలు నిర్వహించుకోవాలని క్రీడాకారులకు సూచించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పుట్టిన రోజు పురష్కరించుకొని ఆయన అభిమానులు, నాయకుల మధ్య కేక్ కట్ చేశారు.

అనంతరం గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్క నాటారు. పలువురు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి జల్లిపల్లి శ్రీరామమూర్తి, పైడి వెంకటేశ్వరావు, యుఎస్ ప్రకాషరావు, మోహన్‌రెడ్డి, ఎంపిటిసి కాసాని దుర్గ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News