గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా పెద్ది. చరణ్ కెరీర్‌లో 16వ సినిమాగా చేస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయితే ఈ సినిమా గ్లింప్స్‌ని మేకర్స్ ఈ ఏప్రిల్ 6న శ్రీ రామ నవమి కానుకగా విడుదల చేస్తున్నారు పెద్ది ఫస్ట్ షాట్ అంటూ వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా గ్లింప్స్ ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మించి ఉండబోతోందని తెలిసింది. అంతేకాకుండా రామ్ చరణ్ డైలాగ్స్ అదిరిపోయే విధంగా ఉంటాయని సమాచారం. మొత్తానికి మాత్రం బుచ్చిబాబు సాలిడ్ కట్‌ని తీసుకురాబోతున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఈ అవైటెడ్ గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ వారు ఈ చిత్రానికి నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతిబాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
శ్రీరామ నవమి కానుకగా ఫస్ట్ షాట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -