Wednesday, January 22, 2025

మానసిక వికాసానికి క్రీడలు దోహదం

- Advertisement -
- Advertisement -
  • ఖోఖో దినోత్సవంలో ఎమ్మెల్సీ డా.యాదవ రెడ్డి

గజ్వేల్: ఆటలు మానసిక వికాసం, శారీరక ధారుడ్యం కోసం ఎంతో ఉపయోగ పడతాయని ఎమ్మెల్సీ డా. యాదవ రెడ్డి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ ఖోఖో దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని ఐఓసి సమీపంలోని గ్రౌండ్‌లో నిర్వహించిన ఖోఖో ఆటల పోటీలను మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తాతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలపై కూడా తగిన ఆసక్తిని పెంచుకోవాలని ఆయన సూచించారు. జాతీయ స్థాయిలో రాణిస్తున్న మన క్రీడా కారులంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని ఆయన తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ క్రీడాపోటీలకు 26 బాలికల జట్లు, 24 బాలుర జట్లకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు ఎఫ్‌డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా లు బహుమతులు , క్యాష్ ప్రైజ్‌తో పాటు జ్ఞాపికలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జిఎప్ కార్యదర్శి రామేశ్వర్ రెడ్డి, గజ్వేల్ బాధ్యులు ఏలేశ్వర్ రావు, ఖోఖో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News