- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశ పెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో క్రీడలకు ఈసారి అదనంగా మరో రూ.45 కోట్లను కేటాయించారు. కిందటిసారి బడ్జెట్‌తో పోల్చితే ఈసారి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రీడలకు పెద్దగా నిధులను కేటాయించలేదని చెప్పాలి. ఈ ఏడాది పారిస్ వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరుగనున్న నేపథ్యంలో క్రీడలకు భారీ మొత్తంలో నిధులను కేటాయిస్తారని భావించారు. అయితే ఆర్థిక మంత్రి మాత్రం కొసమెరుపుగా కేవలం రూ.45 కోట్లను మాత్రంగా అదనంగా ఇచ్చారు. కిందటిసారి క్రీడలకు రూ. 3.396.96 కోట్లు కేటాయించారు. ఈసారి రూ. రూ. క్రీడలకు బడ్జెట్‌లో రూ.3,442.32 కోట్లను మంజూరు చేశారు. కేంద్ర ప్రాధికార సంస్థ (సాయ్), జాతీయ స్పోర్ట్ ఫెడరేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్), నాడా తదితర సంస్థలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించారు.
- Advertisement -