Thursday, November 14, 2024

క్రీడా రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:క్రీడా రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని దేవరకొండ శాసనసభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పురపాలికలోని 10వ వార్డులో రూ.2.51కోట్ల వ్యయంతో చే పడుతున్న షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వీటి ఆధ్వర్యంలో క్రీడాకారులు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పటికప్పుడు క్రీడలను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారు, అధికారులకు సూచించారు. స్టేడియం ఏర్పాటుతో క్రీడాకారులు మరింత నైపుణ్యం కలిగిన క్రీడాకారులుగా తయారయ్యే అ వకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎన్వీటీ నియోజకవర్గ క్రీడాకారుల తరుపున ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నర్సింహ, కమిషనర్ వెంకటయ్య, డిండి ఎంపిపి మాధవరం సునితాజనార్ధన్‌రావు, స్థానిక కౌన్సిలర్ మూడావత్ జయప్రకాశ్‌నారాయణ, డిఎస్‌డిఎం మక్బుల్ అహ్మద్, డీఈ లింగారెడ్డి, ఏఈ శంకర్, పొన్నెబోయిన సైదులు, చిత్రం ప్రదీప్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, న్యాయవాది ఉమామహేష్, పం తులాల్‌నాయక్, వైఎస్‌కరుణాకర్, భాస్కర్‌రెడ్డి, తాళ్ల సురేష్, పి.జె. శ్యా ంసన్, భాస్కర్, ఎర్ర కృష్ణ, వాసు, ఆంజనేయులు, క్రాంతి, రాక్‌స్టార్ రమే ష్, నల్ల నర్సింహ,  వెంకట్, యాదగిరి, పౌల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News