Wednesday, January 22, 2025

యువత క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • మంత్రి చామకూర మల్లారెడ్డి

కీసరః యువత క్రీడా స్పూర్తిని పెంపొందించుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం దమ్మాయిగూడ యువతను ప్రోత్సహించే నిమిత్తం నిర్వహించిన మల్లారెడ్డి క్రికెట్ టోర్నమెంట్ 2023లో విజేతలైన జట్లకు మంత్రి బహుమతులు అందజేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డుల నుండి 18 జట్లు క్రికెట్ పోటీలలో పాల్గొనగా 17వ వార్డు కౌన్సిలర్ మోర మౌనిక నరహరిరెడ్డి జట్టు విజేతగా నిలిచింది. 9వ వార్డు రామారం కార్తీక్ గౌడ్ జట్టు రెండో బహుమతి, ఒర్సు రాములు జట్టు మూడో బహుమతులు గెలుపొందాయి.

విజేతలైన జట్లకు మంత్రి మల్లారెడ్డి నగదు ప్రోత్సాహకాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అసెంబ్లీ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చామకూర మహేందర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ ఛైర్మన్ ఎం.నరేందర్‌రెడ్డి, పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షులు కె.తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.హరిగౌడ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News