Wednesday, January 22, 2025

3,4 తేదీలలో ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరంలో సీటు వచ్చిన విద్యార్థులు అదే కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా సీట్లు మార్చుకునేందుకు సాంకేతిక విద్యాశాఖ అవకాశం కల్పించింది. తమ సీట్లు మార్చుకోవాలనుకునే విద్యార్థులు సెప్టెంబర్ 1వ తేదీన స్లైడింగ్‌లో పాల్గొనాలని అధికారులు సూచించారు. స్పాట్ అడ్మిషన్ల కోసం సెప్టెంబర్ 1వ తేదీన కాలేజీలు నోటిఫికేషన్ జారీచేయాలని, 2న ఖాళీల వివరాలను ప్రకటించి 3, 4 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ విద్యాసంవత్సరం ఇంజినీరింగ్ కోర్సుల్లో 18,815 సీట్లు ఖాళీగా ఉండగా, ఈ సీట్లను ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకునే అవకాశం కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News