Saturday, November 16, 2024

ఈనెల 28న ఉచిత నర్సింగ్ నైపుణ్య శిక్షణకు స్పాట్ అడ్మిషన్లు

- Advertisement -
- Advertisement -

నర్సింగ్ స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ కో ఆర్డినేటర్

 

మనతెలంగాణ/ హైదరాబాద్: బిఎస్‌సి నర్సింగ్, జిఎన్‌ఎం కోర్సులు పూర్తి చేసిన ఎస్‌సి విద్యార్థులకు ఉచిత ఐఈఎల్‌టిఎస్, వొఇటిశిక్షణ, ఉచిత నైపుణ్య శిక్షణకు ఈనెల 28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలంగాణ నర్సింగ్ స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ కో ఆర్డినేటర్ సునీత శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. నర్సింగ్ విద్యను పూర్తి చేసిన ఎస్‌సి విద్యార్థులకు రాష్ట్ర ఎస్‌సి కార్పోరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణతో పాటు విదేశాలకు వెళ్లేందుకు రాసే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్(ఐఈఎల్‌టిఎస్), ఆక్యుపేషనల్ ఇంగ్లీష్ టెస్ట్(వొఇటి) పరీక్షలకు 6 నెలలు పాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ ఉచిత శిక్షణకు ప్రవేశాలు పొందాలనుకునే వారు నేరుగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్ల హాజరయ్యే అభ్యర్థినులు 4 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డు, ఎస్‌ఎస్‌సి, ఇంటర్, జిఎన్‌ఎం, బిఎస్‌సి నర్సింగ్, కుల, ఆదాయ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ సర్టిఫికెట్లతో రావాలని అన్నారు. బాటా షోరూం కాంప్లెక్స్, 4వ అంతస్తు, పనామా, వనస్థలిపురం, హైదరాబాద్ చిరునామాలో ఉదయం 10 గంటల నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 63091 64343, 98480 47327 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News