Thursday, January 23, 2025

ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో సెప్టెంబర్ 2న స్పాట్ అడ్మిషన్లు

- Advertisement -
- Advertisement -

ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మిగిలిపోయిన సీట్లకు వచ్చే నెల 2వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బయోమెడికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్ విభాగాలలో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కళాశాలలోని అసెంబ్లీ హాల్‌లో ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు స్పాట్ అడ్మిషన్స్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

ఒంటి గంట తరువాత వచ్చిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థి ఒరిజినల్ టీసీ తీసుకుని వస్తేనే అడ్మిషన్‌కు అనుమతిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇతర ఇంజినీరింగ్ కళాశాలలో సీట్లు తీసుకోని వారు మాత్రమే దీనికి అర్హులని అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అర్హులు కాదని పేర్కొన్నారు. ఈ కోటా కింద చేరే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదని, హాస్టల్ సదుపాయం సైతం కల్పించబోమని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సహా హాజరుకావాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News