శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో
జనవరి 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు స్పాట్ బుకింగ్ లేదు…
14, 15వ తేదీల్లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న వారికే అవకాశం
పరిమిత సంఖ్యలోనే భక్తులకు అవకాశం
ట్రావెన్‌కోర్ ఆలయ బోర్డు అధికారుల వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమలలో భక్తులకు సురక్షిత దర్శన సౌకర్యం కల్పించడానికి 10వ తేదీ నుంచి స్పాట్ బుకింగ్ సదుపాయం ఉండదని ట్రావెన్‌కోర్ ఆలయ బోర్డు తెలిపింది. 14వ తేదీన వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని 50 వేల మందిని మకర సంక్రాంతి రోజున 15వ తేదీన 40 వేలమందికి మాత్రమే పరిమితం చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. అయ్యప్ప భక్తుల రద్ధీ పెరుగుతున్న కారణంగా స్పాట్ బుకింగ్ చేయడాన్ని నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
సాధారణంగా మకరవిళకున దర్శనానికి మూడు రోజులు ముందుగా వచ్చే అయ్యప్ప భక్తులు సన్నిధానం నుంచి బయలుదేరే శబరిమల వివిధ ప్రాంతాల మకరవిలక్కు, తిరువాభరణ దర్శనానికి వెళతారు. 14వ తేదీ, 15వ తేదీన పిల్లల క్యూ లైన్‌లోకి భక్తులకు అవకాశం ఉండదని వారి క్యూ లైన్‌లో దర్శనానికి వెళ్లకూడదని ట్రావెన్‌కోర్ ఆలయ బోర్డు తెలిపింది. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అనేక మంది భక్తులకు దర్శనానికి, వసతి ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రావెన్‌కోర్ పేర్కొంది.