Wednesday, January 22, 2025

స్పాట్‌ఫ్లోక్‌ కో–ఫౌండర్‌ కు టాప్‌ 20 డీప్‌టెక్‌ ఇన్ల్ఫూయెన్సర్‌ అవార్డు 2022

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: డీప్‌టెక్‌కు డిమాండ్‌ పెరగడంతో డీప్‌టెక్‌ ఇన్ల్ఫూయెన్సర్ల వైపు ప్రజలు దృష్టి సారించడం ద్వారా తమను తాము అప్‌డేట్‌ చేసుకోవడంతో పాటుగా మారుతున్న ధోరణులపై అభిప్రాయాలనూ తెలుసుకుంటున్నారు. ఈ డీప్‌టెక్‌ ఇన్ఫ్లూయెన్సర్లను లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్ధ డీప్‌టెక్‌ సెంట్రల్‌ గ్లోబల్‌ జాబితాకరిస్తుంది. ఈ సంస్ధ 2022 సంవత్సరానికిగానూ అనుసరించతగిన టాప్‌ 20 డీప్‌టెక్‌ ఇన్ఫ్లూయెన్సర్ల జాబితాను విడుదల చేసింది. దీనిలో ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌లో ప్రత్యేకత కలిగి ఉండటంతో పాటుగా మిల్పిటస్‌, కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కలిగి, హైదరాబాద్‌లో ప్రొడక్ట్‌ ఇంజినీరింగ్‌, ఇన్నోవేషన్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న స్పాట్‌ఫ్లోక్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈఓ, కో–ఫౌండర్‌ శ్రీధర్‌ శేషాద్రిని ఎంపిక చేసింది.

బిట్స్‌ పిలానీ, యుటీ అస్టిన్‌ పూర్వ విద్యార్ధి అయిన శ్రీధర్‌ గతంలో ఫేస్‌బుక్‌, ఈఏ స్పోర్ట్స్‌ లాంటి సంస్ధలలో పనిచేశారు. టెక్నాలజీ, వెబ్‌ 3.0, పబ్లిక్‌ పాలసీ, లీడర్‌షిప్‌, మెషీన్‌ లెర్నింగ్‌లో ఉత్పత్తులు, ఎన్‌ఎల్‌పీ, సీవీ, బ్లాక్‌చైన్‌, క్లౌడ్‌ వంటి రంగాలలో అపారమైన పరిజ్ఞానం ఆయనకు ఉంది. డీప్‌టెక్‌ మెంటార్‌గా జెన్‌ జెడ్‌ మధ్య అత్యంత ప్రాచుర్యం పొందారాయన. స్పాట్‌ ఫ్లోక్‌ ప్రస్తుతం భారతదేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్‌ సంస్ధలతో భాగస్వామ్యం చేసుకుని డీప్‌టెక్‌ టెక్నాలజీస్‌ సేవలను అందిస్తుంది.

అనుసరించతగిన 20 మంది డీప్‌టెక్‌ గ్లోబల్‌ ఇన్ఫ్లూయెన్సర్‌ అవార్డును స్కాలర్స్‌, ఎంటర్‌ప్రిన్యూర్స్‌, పరిశ్రమ నిపుణులకు ప్రతి సంవత్సరం డీప్‌టెక్‌ సెంట్రల్‌ గ్లోబల్‌ ఫోరమ్‌ అందిస్తుంది. అంతర్జాతీయంగా విభిన్న ప్రాంతాల నుంచి డీప్‌టెక్‌కు అసాధారణ తోడ్పాటు అందించిన వ్యక్తులు, చూపిన ప్రభావం గుర్తిస్తూ ఈ అవార్డు అందిస్తుంటారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News