Thursday, December 26, 2024

స్ఫుత్నిక్ కోవిడ్ టీకా తయారీ సైంటిస్టు బొటికోవ్ హత్య

- Advertisement -
- Advertisement -

మాస్కో : రష్యా ప్రముఖ సైంటిస్టు అండీ బొటికోవ్ దారుణహత్యకు గురి అయ్యారు. రష్యాలో కోవిడ్ టీకా స్పుత్నిక్ తయారీలో సహకరించిన సైంటిస్టులలో బోటికోవ్ ఒకరు. 47 సంవత్సరాల బోటికోవ్‌ను ఆయన అపార్ట్‌మెంట్‌లోనే బెల్టుతో గొంతుకు బిగించి నులిమి చంపినట్లు మాస్కో పోలీసులు గుర్తించారు. సంబంధిత హత్యోందంతంలో ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు రష్యా మీడియా టాస్ తెలిపింది. అరెస్టు అయిన వ్యక్తిని అలెక్సి జడ్‌గా గుర్తించారు. గురువారం ఆయన హత్య జరిగినట్లు వెల్లడైంది. గమేలెయా ఎకాలజీ, మ్యాథమెటిక్స్ పరిశోధన కేంద్రంలో బోటికోవ్ సైంటిస్టుగా ఉన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ సైంటిస్టును 2021లో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ అత్యుత్తమ ప్రతిభా పురస్కారంతో సన్మానించారు. బోటీకోవ్‌ను 29 ఏండ్ల యువకుడు ఉరిబిగించి చంపినట్లు, ఏదో ఒక విషయంపై జగడంతో చంపివేసి ఫరారయినట్లు మాస్కో పోలీసులు గుర్తించారు. పోలీసులు జరిపిన గాలింపు చర్యలలో ఈ వ్యక్తిని పట్టుకున్నారు. నేరం అంగీకరించినట్లు తెలిపారు. అరెస్టు అయిన వ్యక్తి గత నేర చరిత్ర ఉంది. ఇంతకు ముందు ఓ కేసులో పది సంవత్సరాలు జైలుజీవితం గడిపి వచ్చాడు. సైంటిస్టుకు ఈ వ్యక్తికి మధ్య డబ్బుల విషయంలో కొట్లాట జరిగినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News