- Advertisement -
న్యూఢిల్లీ : సింగిల్ డోసు కరోనా టీకా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి దేశంలో అందుబాటు లోకి రానున్నది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్)తో ఒప్పందం చేసుకున్న పనాసియా బయోటెక్ స్పుత్నిక్ లైట్ అత్యవసర వినియోగం కోసం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి కోరింది. వ్యాక్సిన్ ధర రూ.750 ఉంటుందని, అంచనా వేస్తున్నారు. రష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఏప్రిల్ 12న అత్యవసర వినియోగం కోసం ఆమోదం పొందింది. ప్రస్తుతం వ్యాక్సిన్ 65 దేశాల్లో వినియోగిస్తున్నారు. భారత్‌లో మే లో సాధారణ ప్రజలకు అందుబాటు లోకి వచ్చింది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను మాస్కో లోని గమలేయా ఇనిస్టిట్యూట్ అండ్ రష్యన్ డెవలప్‌మెంట్ ఇన్వెస్టి మెంట్ ఫండ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
Sputnik Light Covid vaccine available next month
- Advertisement -