Friday, November 8, 2024

స్పుత్నిక్-వి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Sputnik-V vaccination drive Started today

హైదరాబాద్: కరోనాపై పోరుకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ తో పాటు ఇండియాలో అత్యవసర వినియోగానికి అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్-వి వ్యాక్సినేషన్ డ్రైవ్ హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో ప్రారంభమైంది. దీనికి సంబంధించిన సాప్ట్ లాంచ్ ను అపోలో హాస్పిటల్స్ ఈ ఉదయం ఆవిష్కరించింది. డా. రెడ్డీస్ సిబ్బందికి స్పుత్నిక్ తొలి డోసు వేసి వ్యాక్సినేషన్ ను ప్రారంభించింది. మొదటి డోసు ట్రయల్ రన్ లో 50 వేల మందికి టీకాలు వేయనున్నారు. డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో అపోలో గ్రూప్ ఆస్పత్రుల్లో వాక్సినేషన్ పైలెట్ ప్రాజెక్ట్ ను అపోలో గ్రూప్ ప్రెసిడెంట్ డా.కె. హరిప్రసాద్, డా. రెడ్డీస్ సిఇవో ఎం.వి. రమణ సోమవారం ప్రారంభించారు. స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారీ, పంపిణీకి డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Sputnik-V vaccination drive Started today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News