- Advertisement -
న్యూఢిల్లీ : స్పుత్నిక్ వి టీకాలను పుణె లోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ నుంచి ఉత్పత్తి చేయనుందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్ ) వెల్లడించింది. భారత్‌లో ఏటా 30 కోట్ల డోసులను ఉత్పత్తి చేయడమే తమ లక్షంగా పెట్టుకున్నట్టు తెలియచేసింది. ఇప్పటికే అవసరమైన టెక్నాలజీ బదిలీ ప్రారంభమైందని, రానున్న నెలల్లో కోట్ల కొద్దీ డోసులు తయారు చేయనున్నట్టు సీరం చీఫ్ అదర్‌పూనావాలా చెప్పారు. ఇందులో తొలి బ్యాచ్ సెప్టెంబర్ నుంచే వస్తుందని తెలిపారు.
Sputnik V vaccine production in serum
- Advertisement -