Sunday, December 22, 2024

పవర్‌ఫుల్ గ్లింప్స్

- Advertisement -
- Advertisement -


నిఖిల్ సిద్ధార్థ్ కధానాయకుడిగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న బహు భాషా చిత్రం ‘స్పై’. ఎవరు, గూడాచారి, హిట్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఎడిటర్‌గా చేసిన గ్యారీ బిహెచ్ దర్శకత్వం లో ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా నిఖిల్‌ని ‘స్పై’గా పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఒక గ్లింప్స్ వీడియోని విడుదల చేసింది.

చేతిలో ట్రాన్స్‌మీటర్‌తో మంచు పర్వతాల మీద నడుస్తున్న నిఖిల్ ఆయుధాలు వున్న రహస్య ప్రదేశాన్ని చేరుకోవడం, ఆయుధాలు పట్టుకొని బైక్ నడుపుతూ శత్రువులను వేటాడడానికి రంగంలో దిగడం… ఈ పవర్‌ఫుల్ గ్లింప్స్‌లో చూపించారు. ఇందులో నిఖిల్ స్లిక్, స్టైలిష్, డాషింగ్‌గా కనిపిస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం దసరాకి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుండగా, సన్యా ఠాకూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కైకో నకహరా, హాలీవుడ్ డిఓపి జూలియన్ అమరు ఎస్ట్రాడా డీవోపీగా పని చేస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటేకర్, రాబర్ట్ లీనెన్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను కూడా అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News