Monday, December 23, 2024

నిఖిల్ నిజమైన రాక్‌స్టార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యమీనన్ జంటగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘స్పై’ థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని సత్యం మాల్‌లోని ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్‌లో గ్రాండ్‌గా జరిగింది. స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండడంతో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ “డైరెక్టర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాను చివరి నిమిషం వరకు చెక్కుతున్నారు. ఈ సినిమాకు సెన్సార్ నుంచి ఒక్క కట్ కూడా లేకుండా యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది.

ఇక రానా అన్న కథ చెప్పగానే ఎంతగానో నమ్మి ఈ సినిమా చేశారు. ఆయన నిజంగా సర్‌ప్రైజ్ చేస్తారు. ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం”అని అన్నారు. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ మాట్లాడుతూ “నిఖిల్ నిజమైన రాక్‌స్టార్. ఆయనతో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా”అని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ “ఈ మూవీలో నేను రెండు పాటలు చేశాను. త్వరలో ఒక బ్యాంగర్ సాంగ్ రిలీజ్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ స్టఫ్‌తో సాంగ్స్ ఉంటాయి”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చరణ్ తేజ్, సానియా, అభినవ్ గోమటం పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News