- Advertisement -
హైదరాబాద్: యూట్యూబర్ పలుమార్లు జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరికి జిల్లాకు చెందిన యువతికి 2021 లో గుంటూరు జిల్లా కాకాని ప్రాంతానికి చెందిన యువకుడు రోహిత్ ఖాన్ పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో యువతి హైదరాబాద్ కి వచ్చి యూట్యూబ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ బోరబండలో నివాసముంటుంది.
రోహిత్ ఖాన్ కూడా హైదరాబాద్ లోనే జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నాడు.దీంతో రోహిత్ ఖాన్ యువతితో శారీరకంగా పలుమార్లు కలవడంతో యువతి గర్భం దాల్చింది. యువతి రోహిత్ ఖాన్ పెళ్లి చేసుకొమని కోరగా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధిత యువతి ఎస్ఆర్ నగర్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -