Wednesday, December 25, 2024

మ్యారేజ్ యాప్‌లో పరిచయం… ఎస్‌ఆర్‌నగర్‌లో యువతిపై యువకుడు అత్యాచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెళ్లి సంబంధాలు చూసే యాప్ ద్వారా పరిచయమైన యువతిపై యువకుడు అత్యాచారం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉప్పల్ ప్రాంతానికి చెందిన యువతి(27) తన పెళ్లి యాప్‌లను ఆశ్రయించింది. పెళ్లి సంబంధాలు చూసే ఓ యాప్‌లో ముత్తుమ్ముల రాజశేఖర్(30) అనే యువకుడు పరిచయమయ్యాడు. రాజశేఖర్ ఎస్‌ఆర్ నగర్‌లోని జయప్రకాశ్‌నగర్‌లో ఫొటో స్టూడియో రన్ చేస్తున్నాడు.

ఇద్దరు పరిచయం ఉండడంతో ఆమె ఈమెయిల్ ఐడిని కూడా అతడు పలుమార్లు వాడుకున్నాడు. ఈ నెల 24న యువతికి ఫోన్ చేసి తన ఫోటో స్టూడియో రమ్మని కబురు పంపాడు. ఫొటో స్టూడియోకు వెళ్లగానే ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. మరో మహిళ సహాయంతో యువతి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు రాజశేఖర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News