Sunday, December 22, 2024

ఎస్‌ఆర్ యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: మండలంలోని ఎస్‌ఆర్ యూనివర్సిటీలో అగ్చికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్ అనే విద్యార్థిని హాస్టల్‌లో ఉరి వేసుకొని మృతిచెందింది. హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ ఎస్‌ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్ హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా విద్యార్థిని మృతి చెందిన విషయాన్ని హాస్టల్ యాజమాన్యం పోలీసులు,

తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఎంజీఎం మార్చూరీకి తరలించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తోటి విద్యార్థులు అంటున్నారు. ఈ మధ్య కాలంలో పలు కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు తల్లిదండ్రులను తీవ్రంగా కలిచివేస్తుంది. దీప్తి రాథోడ్ మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News