- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ రావు మంగళవారం మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. గత ఎన్నికల సందర్భంగా శ్రవణ్ రావు వాడిన రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు.. సెల్ ఫోన్‌లలోని సమాచారం ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
కాగా, ఇప్పటికే శ్రవణ్ రావు రెండు సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే, విచారణలో శ్రవణ్ రావు సరైన సమాధానాలు చెప్పకుండా, విచారణకు సహకరించకపోవడంతో ఈనెల 8వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఈరోజు మరోసారి ఆయన సిట్ హాజరయ్యారు.
- Advertisement -