Monday, December 23, 2024

‘ధమాకా’ చేయడం చాలా లక్కీ..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’ధమాకా’. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈనెల 23న ’ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “ధమాకా… చాలా మంచి ఎంటర్‌టైనర్. చాలా హిలేరియస్‌గా వుంటుంది. నాకు ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చాలా ఇష్టం.

అందుకే ఈ సినిమా చేశా. రాఘవేంద్ర రావు సినిమాతో హీరోయిన్‌గా లాంచ్ కావడం తర్వాత రవితేజతో ‘ధమాకా’ లాంటి బ్యూటీఫుల్ ప్రాజెక్ట్ చేయడం చాలా లక్కీగా వుంది. రవితేజ లాంటి స్టార్ హీరోతో నా రెండో సినిమా కావడంతో మొదట చాలా టెన్షన్ పడ్డా. అయితే ఆయనతో పనిచేస్తుంటే నమ్మకం వచ్చింది. రవితేజకి నేను పెద్ద ఫ్యాన్‌ని. కిక్, విక్రమార్కుడు సినిమాలు ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు. సినిమాలోని జింతాక్ పాట బాగా నచ్చింది. తర్వాత వాట్స్ హ్యాపెనింగ్ పాట. అందులో వయోలిన్ బిట్ చాలా ఇష్టం. ఈ సినిమాలో ప్రణవి అనే పాత్రలో కనిపిస్తా”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News