మన తెలంగాణ/ మెండోరా : తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ ద్వారా యాసంగి సాగుకు నీటిని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణశాఖ,శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేర కు శుక్రవారం ఎంపిపి బురుకల సుకన్య కమలాకర్ విడుదలచేశారు. యాసంగి సాగుకు కాకతీయ కాలువ దిగువ ప్రాంత రైతులకు పంటసాగుకుగాను శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. పెద్దపెల్లి, ఎగువ ఎల్‌ఎండికి నీటిని పంపిణీచేయడంజరుగుతుందని, మొత్తం 9లక్షల 60వేల ఎకరాలకు సా గునీరందుతుందని తెలిపారు, రైతులు సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో జడ్‌పిటిసి గంగాధర్, వైస్ ఎంపిపి సరప్వతి, రవిగౌ డ్, సమన్వయ కోఆర్డినేటర్ సాయిరెడ్డి, మండల తెరాస ప్రధాన కార్యదర్శి నవీన్‌గౌడ్, పోచంపాడ్ గ్రామ సర్పంచ్ మిస్బా, సొసైటీ ఛైర్మన్ రాజారెడ్డి, మండల కో ఆప్షన్ బాబా, సోన్‌పేట్ డైరెక్టర్ జక్కయ్య, రైతులు, అధికారులు పాల్గొన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువద్వారా యాసంగి సాగునీటి విడుదల
- Advertisement -
- Advertisement -
- Advertisement -