Monday, March 10, 2025

మెగాస్టార్ చిరంజీవికి స్పెషల్‌ గిఫ్ట్ ఇచ్చిన శ్రీలీల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి సామాన్యులే కాదు.. ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్‌గా ఉంటారు. ఇప్పుడు ఉన్న సెలబ్రిటీల్లో చాలా మంది ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చామని చెబుతుంటారు. ఆయన్ని కలిస్తే.. ఓ ఫోటో దిగి.. ఆ అనుభూతిని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అలాంటి ఫ్యాన్ మూమెంటే హీరోయిన్ శ్రీలీలకు ఎదురైంది. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌లో చిరంజీవి బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్‌లో శ్రీలీల ఆయన్ను కలిసి ఓ ప్రత్యేకమైన బహుమతి ఇచ్చింది. వెండితో చేసిన శంఖాన్ని చిరుకి బహుమతిగా ఇచ్చిన లీల.. ఆ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్ చేసింది.

‘‘వెండితెరపై మనందరం ఎంతగానో ఆదరించే శంకర్‌దాదా ఎంబిబిఎస్. మహిళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కానుక. మీ విషెస్, రుచికరమైన భోజనానికి ధన్యవాదాలు’’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది శ్రీలీల. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక విశ్వంభర సినిమాలో త్రిషా హీరోయిన్‌గా నటిస్తోంది. సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ఈ సినిమాకు విశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను యు.వి క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News