Monday, January 20, 2025

పవర్‌స్టార్‌తో శ్రీలీల మాస్ సాంగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ తో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దళపతి విజయ్ బ్లాక్‌బస్టర్ ‘తెరి’ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ నటి ‘ధమాకా’లో తన అద్భుతమైన డ్యాన్స్‌తో అందరినీ అలరించింది. అందుకే ఈ సినిమాలో పవన్, శ్రీలీలతో పర్ఫెక్ట్ మాస్ నంబర్ ప్లాన్ చేయమని అభిమానులు ట్విట్టర్‌లో దర్శకుడిని అభ్యర్థించారు.

హరీష్ శంకర్ అందుకు పాజిటివ్‌గా స్పందించారు. ఓకే అన్నట్లుగా థంబ్స్ అప్ ఏమోజి పెట్టారు. డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందనతో ఫ్యాన్స్ ఫుల్‌జోష్‌లో ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని హరీష్ శంకర్ అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News