Monday, January 20, 2025

ఎంబిబిఎస్ పరీక్షలకు శ్రీలీల డుమ్మా

- Advertisement -
- Advertisement -

అప్పట్లో హీరోయిన్లు.. డాక్టర్ కాబోయి యాక్టర్ని అయ్యాయని చెప్పుకునేవారు. కానీ మన తెలుగు బ్యూటీ శ్రీలీల  యాక్టింగ్ చేస్తూనే మరోవైపు డాక్టర్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతున్న శ్రీలీల.. ఈ మద్య వారం రోజులు షూటింగ్ కు విరామమిచ్చి, పరీక్షలు రాసేందుకు సీరియస్ గా పుస్తకాలు ముందేసుకుని చదువుతోంది. ఇక్కడే ఆమెకు చిక్కొచ్చి పడింది.

శ్రీలీల తాజాగా మహేశ్ బాబుతో కలసి గుంటూరు కారం మూవీలో నటిస్తోంది. సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్  శరవేగంగా షూటింగ్ జరుపుతోంది. అయితే అకస్మాత్తుగా  శ్రీలీల వారం రోజులు సెలవు పెట్టడంతో దర్శక నిర్మాతలు కంగారు పడ్డారు. ఇలాగైతే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం కష్టమని భావించి, శ్రీలీలను సంప్రదించారట. దాంతో శ్రీలీల చదువును తాత్కాలికంగా పక్కనబెట్టి, షూటింగ్ కు వచ్చేసిందట. ప్రస్తుతం హీరోహీరోయిన్ల మధ్య జరుగుతున్న డాన్స్ సీక్వేన్స్ లో శ్రీలీల పాల్గొంటోంది. అయితే ఎంబిబిఎస్ ను వదిలిపెట్టనని, సప్లిమెంటరీలో పరీక్షలు రాస్తాననీ ఆమె ధీమాగా చెబుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News