హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలంలోనే.. స్టార్ స్టేటస్ సంపాదించుకున్న నటి శ్రీలీల. ప్రత్యేకంగా ఆమె డ్యాన్స్‌కి పెద్ద ఫ్యాన్స్ బేస్ ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ ఓ సినిమాతో బిజీగా ఉంది ఈ భామ. అయితే శ్రీలీల సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుటుంది. తాజాగా ఓ చిన్నారిని ముద్దాడుతూ.. శ్రీలీల పెట్టిన ఫోటో వైరల్ అవుతోంది.
2022లో శ్రీలీల ఓ అనాథాశ్రమాన్ని సందర్శించింది. ఆ సందర్భంలో ఆమె దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి తల్లడిల్లింది. దీంతో వాళ్లిద్దరిని శ్రీలీల దత్తత తీసుకుంది. అయితే ఇప్పుడు మరో చిన్నారితో శ్రీలీల పోస్ట్ చేసేసరికి ఆ పాపను కూడా ఆమె దత్తత తీసుకుందని నెటిజన్లు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ పాప శ్రీలీల బంధువుల బిడ్డ కావొచ్చు అని అంటున్నారు. మరి ఈ విషయం నిజం తెలియాలి అంటే.. శ్రీలీల స్పందించాల్సిందే.