Thursday, January 23, 2025

‘పుష్ప 2’ స్పెషల్ సాంగ్కు స్టార్ హీరోయిన్ ఫైనల్.. ఎవరంటే?

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న మోస్ట్ అవేయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ నుంచి ఓ క్రేజీ వార్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావా..’ అనే సాంగ్ ఎంతగా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సమంత నటించిన ఈ సాంగ్ దేశవ్యాప్తంగా అందరినీ ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు రెండో పార్ట్ లోనూ అలాంటి అదిరిపోయే సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఈ సాంగ్ కోసం ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఉన్న స్టార్ హీరోయిన్స్ లలో ఒకరు ఈ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు.. ఈ సాంగ్ చేసేందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఒకే చెప్పినట్లు ఇటీవల రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ స్పెషల్ సాంగ్ లో ఆడిపడే అందాల భామ దొరికేసినట్లు తెలుస్తోంది. అమె ఎవరో కాదు.. మన తెలుగు యంగ్ బ్యూటీ శ్రీలీలను ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News