ముంబై : భారత వరల్డ్ కప్ జట్టులో సంజుశాంసన్‌కు చోటు దక్కకపోవడంతో సంజు అభిమానులకు తీవ్ర నిరాశకు గురి చేసింది. అతని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సానుభూతిని తెలుపుతున్నారు. దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు శ్రీశాంత్ స్పందించాడు. సంజు శాంసన్ సామర్థమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతన్ని దిగ్గజాలు సునీల్ గావస్కర్, రవిశాస్త్రి, హర్ష బోగ్లే వంటి వారందరూ మంచి క్రికెటర్‌గా గుర్తించారు. అతని అవకాశాలు ఇవ్వాలని బోర్డుకు సూచించారు.
కానీ అవకాశాలు వచ్చినా సంజు ఉపయోగించుకోవడంతో విపలమయ్యాడు. అవకాశాలు రాలేదనడం సరికాదు. పిచ్‌కు తగ్గట్లు ఆడాలని ఎవరూ సూచించిన సంజు వినడు. ఇటీవలె శ్రీలంక, ఐర్లాండ్ సిరీస్‌లలో విఫలమయ్యాడు. అంతేకాదు సంజు 10 ఏల్లు క్రికెట్ ఆడుతున్నాడు. అటు ఐపిఎల్‌లో కూడా ఆడుతున్నాడు. కానీ నిలకడగా రాణించలేకపోతున్నాడు. సానుభూతి పొందడం కాకుండా ఆటలో నిలకడ సాధించి తిరిగి జట్టులోకి రావాలని విశ్వసిస్తున్నాను’ అని తెలిపాడు. అతని ఆలోచన విధానాన్ని మార్చుకుంటే అన్ని పార్మట్లలో రాణించే సామర్థం ఉందని శ్రీశాంత్ పేర్కొన్నాడు.