Sunday, January 19, 2025

వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణానికి అంగరంగ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఉదయం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవాస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణము పురస్కరించుకొని సాయంత్రం 5:30 గంటలకు మంకమ్మతోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి పద్మనగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ ప్రాంగణం వరకు స్వామి వారి శోభాయాత్ర నిర్వహించారు.

అనంతరం స్వామి వారి కళ్యాణాన్ని ముత్యాల తలంబ్రాలు….మంగళవాయిద్యాలు….విశేష అలంకరణలు….వేదపండితులు వేదమంత్రోచ్చరణలు,. వెలువెరిసిన భక్తి పారవశ్యం నడుమ శ్రీనివాసుడి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల వేద మంత్రముల మధ్య శ్రీవారి కల్యాణాన్ని శాస్త్రత్తంగా కొనసాగింది.

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ , కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటి మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ కుటుంబ సమేతంగా స్వామి వారి కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు. కరీంనగరం గోవింద నామస్మరణలతో మార్మోగుతోంది, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
భక్తులకు అన్న ప్రసాద వితరణ
శ్రీ శ్రీనివాస కళ్యాణము పురస్కరించుకొని తరలి వచ్చిన భక్తులకు లడ్డు ప్రసాదంతో పాటు అన్న ప్రసాద వితరణ చేశారు. స్వామి వారి కళ్యాణంకు వచ్చిన భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. గోగుల ప్రసాద్ బృందం ఆధ్వర్యంలో అలరించిన అన్నమాచార్య కీర్తనలు. మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణంలో మేయర్ సునీల్ రావు, గ్రంథాలయం చైర్మన్ అనిల్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, సిపి సుబ్బ రాయుడు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీసీ కమీషన్ చైర్మన్ ఒకలాభరణం కృష్ణమోహన్ రావు.. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతదితరులున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News