Tuesday, April 1, 2025

సన్‌రైజర్స్ బౌలింగ్ గాడిలో పడాల్సిందే!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనే అత్యంత విధ్వంసక బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకుంది. కిందటి సీజన్‌లో హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను తిరిగరాశారు. తాజాగా ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లోనే హైదరాబాద్ బ్యాటర్లు దూకుడైన బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టించారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ తదితరులు విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. వీరిని కట్టడి చేయడంలో రాజస్థాన్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులోనూ హైదరాబాద్ భారీ స్కోరే సాధించింది. గత మ్యాచ్‌తో పోల్చితే ఈసారి బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. అయినా హైదరాబాద్ ప్రత్యర్థి ముండు 193 పరుగుల క్లిష్టమైన లక్షంను విధించడంలో సఫలమైంది.

రెండు మ్యాచుల్లో సన్‌రైజర్స్ భారీ స్కోరును సాధించినా బౌలర్లు మాత్రం ఆ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తొలి మ్యాచ్‌లో 287 పరుగులు సాధించినా ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తేవడంలో సన్‌రైజర్స్ బౌలర్లు విఫలమయ్యారు. పాట్ కమిన్స్, షమి, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నా తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌లో ఇబ్బందులు తప్పలేదు. రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనూ బౌలింగ్ వైఫల్యం జట్టును వెంటాడింది. నికోలస్ పూరన్, మిఛెల్ మార్ష్‌లపై సన్‌రైజర్స్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేక పోయారు. పూరన్, మార్ష్‌లు విధ్వంసక బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించారు. పూరన్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. 26 బంతుల్లోనే 70 పరుగులు సాధించాడు. దీన్ని బట్టి అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో ఊహించు కోవచ్చు.
తీరు మారాల్సిందే..
రానున్న మ్యాచుల్లో హైదరాబాద్ విజయాలు సాధించాలంటే బౌలింగ్ గాడిన పడక తప్పదు. ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ బౌలర్లు నిలకడైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. కమిన్స్, షమి, హర్షల్, జంపా తదితరులు పొదుపుగా బౌలింగ్ చేయాల్సిందే. షమి, హర్షల్ విఫలం కావడం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో షమి బాగానే బౌలింగ్ చేశాడు. కానీ ఐపిఎల్‌లోఆడిన రెండు మ్యాచుల్లోనూ విఫలం కావడం ఆందోళన కలిగించే అంశమే. కమిన్స్, హర్షల్, జంపాలు కూ డా పొదుపుగా బౌలింగ్ చేయాల్సి ఉంది. అప్పుడే సన్‌రైజర్స్ గెలుపు అవకాశాలు మెరుగవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News