Monday, December 23, 2024

హ్యాట్రిక్‌పై సన్‌రైజర్స్ కన్ను

- Advertisement -
- Advertisement -

నేడు కోల్‌కతాతో పోరు

SRH concentrate on Hatrick win

ముంబై: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గిన హైదరాబాద్ ఆత్మవిశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. తొలి రెండు మ్యాచుల్లో సన్‌రైజర్స్ ఓటములు చవిచూసింది. దీంతో ఈ సీజన్‌లో హైదరాబాద్ కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలుస్తుందా అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి. కానీ సన్‌రైజర్స్ మాత్రం చివరి రెండు మ్యాచుల్లో అద్భుత ఆటతో మళ్లీ పుంజుకొంది. ఈ క్రమంలో పటిష్టమైన చెన్నై సూపర్‌కింగ్స్ (సిఎస్‌కె), గుజరాత్ టైటాన్స్ జట్లను ఓడించింది. కోల్‌కతా మ్యాచ్‌లో కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే తహతహలాడుతోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, కేన్‌విలియమ్సన్‌లు ఫామ్‌లోకి రావడం హైదరాబాద్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. అభిషేక్ చెన్నై మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచాడు. గుజరాత్‌పై కూడా మెరుగైన స్కోరు సాధించాడు. ఇక నికోలస్ పూరన్, రాహుల్ త్రిపాఠిలు బాగానే ఆడుతున్నారు. మార్‌క్రామ్ కూడా ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. కానీ సమష్టిగా రాణిస్తేనే హ్యాట్రిక్ విజయం దక్కే ఛాన్స్ ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్షంగా ఆడిన మరోసారి ఓటమి తప్పక పోవచ్చు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈసారి కూడా టాప్ ఆర్డర్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకొంది. ఇక బౌలింగ్‌లో సీనియర్ భువనేశ్వర్ కుమార్ సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నటరాజన్ నిలకడగా రాణించడం హైదరాబాద్‌కు కలిసి వచ్చే అంశమే. ఇక గాయం బారిన పడిన స్టార్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. అతను లేక పోవడం జట్టుకు పెద్ద లోటుగానే చెప్పాలి.

తక్కువ అంచనా వేయలేం..

మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు ఆ జట్టులో కొదవలేదు. రహానె, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, శామ్ బిల్లింగ్స్, షెల్డాన్ జాక్సన్. రసెల్, నరైన్ వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. కాగా, సీనియర్ ఆటగాడు రహానె అంతంత మాత్రం బ్యాటింగ్‌తో సతమతమవుతున్నాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారుతోంది. ఈసారి అతనికి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది సందేహమే. ఇక కెప్టెన్ అయ్యర్ కోల్‌కతాకు చాలా కీలకంగా మారాడు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News