Saturday, April 5, 2025

తేలిపోతున్న సన్ రైజర్స్

- Advertisement -
- Advertisement -

వెంటాడుతున్న వరుస ఓటములు

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్18లో సన్‌రైజర్స్ హైదరాబా ద్ వరుస ఓటములతో సతమతమవుతోంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రా యల్స్‌పై ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్ ఆ తర్వాత వరుసగా రెండు పోటీల్లో పరాజయం చవిచూసింది. బ్యాటింగ్ వైఫల్యం హైదరాబాద్‌కు స మస్యగా మారింది. రెండో మ్యాచ్‌లో కాస్త బాగానే ఆడినా ఢిల్లీతో విశాఖలో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా తయారైంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ అభిషేక్ విఫలమయ్యాడు.

ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తా రుమారు చేసే సత్తా కలిగిన అభిషేక్ వైఫల్యం జట్టును ఇబ్బందులకు గురి చేస్తోంది. రానున్న మ్యాచుల్లోనైనా అతను బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవస రం ఉంది. ఇక తొలి మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ తర్వాతి రెండు మ్యాచుల్లోనూ తేలిపోయాడు. రెండో మ్యాచ్‌లో ఖాతా కూడా తె ర వలేదు. ఇక విశాఖలో జరిగిన పోరులో రెండు పరుగులకే పెవిలియన్ చేరా డు. ట్రావిస్ హెడ్ కూడా చివరి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. నితీశ్ రెడ్డి కూ డా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నారు.

యువ ఆటగా డు అంకిత్ వర్మ, వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌లు మాత్రమే నిలకడగా బ్యా టింగ్ చేస్తున్నారు. కాగా, కీలక ఆటగాళ్లు పేలవమైన ఫామ్‌తో సతమతమ వుతుండడం హైదరాబాద్ వరుస ఓటములకు ప్రధాన కారణంగా చెప్పాలి. బౌలింగ్‌లో కూడా సన్‌రైజర్స్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. కమిన్స్, షమి, జంపా, హర్షల్ పటేల్ తదితరులు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. షమి ప్రతి మ్యాచ్‌లోనూ నిరాశ పరుస్తున్నాడు. మిగిలిన మ్యాచుల్లోనైనా బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించక తప్పదు. అప్పుడే సన్‌రైజర్స్ గెలుపు అవకాశా లు మెరుగు పడుతాయి. లేకుంటే హ్యాట్రిక్ ఓటమి ఖాయమని చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News