మే 20 ఆదివారంతో ఐపిఎల్ ఫస్టాఫ్ ముగిసింది. ఇందులో నుంచి కోల్ కతా, హైదరాబాద్, రాజస్థాన్, బెంగళూరు నాలుగు జట్టు సెకండాఫ్ లోకి ఎంటరయ్యాయి. దీంతో ఇప్పటి నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులను ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ప్లేఆఫ్ కు చేరుకున్న ఈ నాలుగు జట్లు టైటిల్ ను కైవసం చేసుకునేందుకు సిద్ధమయ్యాయి.
ఇక, మే 21వ తేదీ మంగళవారం హైదరాబాద్, కోల్ కతా జట్ల మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కేకేఆర్, సన్ రైజర్స్ తలపడతాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 2 ఆడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది.
మే 22వ తేదీ బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్, బెంగళూరు జట్లు తలపడతాయి.ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2కు చేరుకుంటుంది. మే 24వ తేదీ శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టుతో ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు ఢీకొట్టుంది. మే 26వ తేదీ ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.