నేడు లక్నోతో పోరు
మన తెలంగాణ /హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌కు ఆతిథ్య సన్‌రైజర్స్ హైదరాబాద్ సమరోత్సాహంతో సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ పోరు జరుగనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సన్‌రైజర్స్ చాలా బలంగా ఉంది. దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతుండడం మరింత కలిసి వచ్చే అంశంగా మారింది.
ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కిందటి మ్యాచ్‌లో ఢిల్లీతో చివరి బంతి వరకు పోరాడి ఓడిన లక్నో కూడా ఈ మ్యాచ్‌లో గెలవాలనే లక్షంతో కనిపిస్తోంది. ఢిల్లీ మ్యాచ్‌లో లక్నో అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
ఓపెనర్లే కీలకం..
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు కీలకంగా మారారు. రాజస్థాన్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో వీరు జట్టుకు కళ్లు చెదిరే శుభారంభం అందించారు. ఈసారి కూడా మెరుపు ఆరంభాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కిందటి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిన అభిషేక్ శర్మ ఈసారి భారీ స్కోరుపై కన్నేశాడు. అభిషేక్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే హైదరాబాద్‌కు ఎదురే ఉండదు. ట్రావిస్ హెడ్ తొలి మ్యాచ్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. లక్నోపై కూడా అదే జోరును సాగించాలని భావిస్తున్నాడు. హెడ్ చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు ఖాయం.
ఇషాన్ జోరు సాగాలి..
సన్‌రైజర్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే కళ్లు చెదిరే శతకంతో అలరించిన మరో యువ సంచలనం ఇషాన్ కిషన్‌పై కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రాజస్థాన్‌పై ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. వరుస ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. అతన్ని కట్టడి చేయడంలో ప్రత్యర్థి జట్టు బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఈసారి కూడా ఇషాన్ ఇలాంటి ఇన్నింగ్సే ఆడాలని తహతహలాడుతున్నాడు.
అదే జరిగితే అభిమానులకు మరోసారి అద్భుత బ్యాటింగ్ విన్యాసాలు చూసే ఛాన్స్ దొరకుతోంది. హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డిలు కూడా చెలరేగి ఆడితే లక్నో బౌలర్లకు ఇబ్బందులు ఖాయం. ఐపిఎల్‌లో అత్యంత విధ్వంసక బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టుగా సన్‌రైజర్స్ పేరు తెచ్చుకుంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసక బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టించారు. లక్నోపై కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యారు. బౌలింగ్‌లో కూడా హైదరాబాద్ బాగానే ఉంది. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు లక్నోను కూడా తక్కువ అంచనా వేసే ప్రసక్తి లేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు. మార్‌క్రమ్, నికోలస్ పూరన్, మిఛెల్ మార్ష్, డేవిడ్ మిల్లర్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. కెప్టెన్ రిషబ్ పంత్ రూపంలో మరో విధ్వంసక బ్యాటర్ ఉండనే ఉన్నాడు. ఆయూష్ బడోని, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్ తదితరులతో లక్నో చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో లక్నోకు కూడా గెలుపు అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి.