Monday, March 24, 2025

ఐపిఎల్‌కు ఉప్పల్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

నేడు రాజస్థాన్‌తో సన్‌రైజర్స్ తొలి పోరు

మన తెలంగాణ/ హైదరాబాద్: ఐపిఎల్ సీజన్ 2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఈ మ్యాచ్ జరుగనుంది. మధ్యా హ్నం జరిగే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల్లలన్నీ ఇప్పటికే అమ్ముడై పోయాయి. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) ఆరంభ మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేసిం ది. హైదరాబాద్‌కు పాట్ కమిన్స్, రాజస్థాన్‌కు రియాన్ పరాగ్ సారథ్యం వహిస్తున్నారు. సంజు శాంసన్ ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు.

అతని స్థానంలో పరాగ్ సారథ్య బాధ్యతలను నిర్వర్తిస్తాడు. ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. రాజస్థాన్‌లో శాంసన్, యసశ్వి జై స్వాల్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హె ట్‌మెయిర్, హసరంగ, తీక్షణ, జురేల్, ఆర్చర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఈ మ్యాచ్‌కు శాంసన్, యశస్వి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే వీరూ జట్టు కు శుభారంభం అందించాలనే పట్టుదలతో ఉన్నారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా రాజస్థాన్‌కు కీలకంగా మారా డు. విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించేందు కు అతను సిద్ధహమయ్యాడు. నితీశ్, పరా గ్, హెట్‌మెయిర్‌లను కూడా తక్కువ అంచ నా వేసే ప్రసక్తి లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న రాజస్థాన్ భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది.

ఫేవరేట్‌గా..

మరోవైపు ఆతిథ్య సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. రాజస్థాన్‌తో పోల్చితే సన్‌రైజర్స్‌లో బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కిందటి సీజన్‌లో పరుగుల సునామీ సృష్టించిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్‌లు ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి అభిషేక్, హెడ్‌లపైనే నిలిచింది. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే ఈ జంట మెరుపు ఆరంభాన్ని ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఇషాన్ కిషన్ రూపంలో మరో పదునైన అస్త్రం సన్‌రైజర్స్‌కు అందుబాటులో వచ్చింది. నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ షమి, హర్షల్ పటేల్, కమిన్స్, ఆడమ్ జంపా తదితరులతో సన్‌రైజర్స్ చాలా బలంగా ఉంది. రెండు విభాగాల్లోనూ సమతూకంగా ఉన్న హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News