- Advertisement -
ముంబై: ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో సన్‌రైజర్స్ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్ ప్రియం గార్గ్ (42), వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (76) జట్టును ఆదుకున్నారు. పూరన్ (38) తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. టిమ్ డేవిడ్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 46 పరుగులు చేసి ముంబైని దాదాపు గెలిపించినంత పని చేశాడు. అయితే అతను కీలక సమయంలో ఔట్ కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.
- Advertisement -